National

2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్

దేశంలో యూట్యాబ్ ద్వారా ఉపాధి పొందే వారు క్రమంగా పెరుగుతోన్నారు. కొందరైతే యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు.దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తోందట.

యూట్యూబ్ తో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. 2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించిందని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యూట్యూబ్ ఆదాయ వనరుగా మార్చుకున్న వారు.. అందులో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రకరకాల వీడియో చేస్తున్నారు.

వినూత్న ఆలోచనలతో వీడియోలు రికార్డు చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ఈ వీడియోలతో యూట్యూబ్ క్రియేటర్లు జైలు పాలు కూడా అవుతున్నారు.కొత్త క్రియేటివిటీ అంటూ చట్టాన్ని సైతం లెక్క చేయకుండా వీడియోలు తీసి అరెస్ట్ అవుతున్నారు. తాజాగా యూట్యూబ్ క్రియేటర్లు అరెస్ట్ అయిన ఘటన ఉమ్మడి వరంగల్ లో జరిగింది. ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు “విలేజ్ థింగ్స్”పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతోన్నారు.

వీడియోలు అప్ లోడ్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీడియోలకు వ్యూస్ రావడం లేదని డిఫరెంట్ గా వీడియో చేయాలనకున్నారు. అడవిలో వేటకు సంబంధించిన వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని భావించారు. అడవిలోకి వెళ్లి ఓ ఉచ్చు బిగించి అడవి కోడి పట్టుకున్నారు. దాన్ని కాల్చి తిన్నారు. ఇదంతా వీడియో తీసి అడపలతో వేట-ఇది మా ప్రాచీన పద్ధతి అని టైటిల్ పెట్టి వీడియో అప్ లోడ్ చేశారు.

ఈ వీడియోకు వ్యూస్ రాకపోగా..కేసులకు దారి తీసింది. ఈ వీడియో అటవీ శాఖ అధికారులు చూశారు. ఈ ముగ్గురిని గుర్తించి వారి కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేశారు. ఫారెస్ట్, పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో మీలో ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేసే వారుంటే జాగ్రత్త వీడియోలు చేయండి. లేకు ఈ ముగ్గురిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది.