National

హైదరాబాద్ వ్యాప్తంగా 22 వేల మ్యాన్ హోళ్లకు గ్రిల్స్ ఏర్పాటు..

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అయితే పట్నం వర్షం పడితే భయమే.. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదు. దీంతో వర్షం తర్వాత బయటకు వెళ్లడానికి చాలా మంది భయపడతారు.

ఇందుకు చాలా మంది మ్యాన్ హోళ్లలో పడి చనిపోయారు. ముఖ్యంగా పిల్లలు ఈ మ్యాన్ హోళ్ల పడి చనిపోతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షానికి ప్రగతి నగర్ లో ఓ బాలుడు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ పడి మృతి చెందాడు. గత ఏప్రిలో సికింద్రాబాద్ లో ఓ చిన్నారి మ్యాన్ హోల్ పడి చనిపోయింది.

వరద నీరును వెళ్లిపోవడానికి కొంత మంది మ్యాన్ హోళ్లను ఓపెన్ చేస్తుంటారు. ఆ తర్వాత దాన్నీ మూయరు. దీంతో అందుల పడి చనిపోతుంటారు. దీనిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 22 వేల మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిస్స్ ను ఏర్పాటు చేశారు. వాటి రెడ్ మార్క్ కూడా ఏర్పాటు చేసారు. చాలా చోట్ల ఇక్కడ మ్యాన్ హోల్ ఉందంటూ హెచ్చరి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మ్యాన్ హోల్స్ వద్ద నీరు వెళ్లకుంటే వెంటనే సంబంధిత సిబ్బంది సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇష్టమొచ్చినట్లు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. రోడ్లపై ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మాన్ సూన్ సేఫ్టీ టీమ్, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ వాహనాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించినట్లు తెలిపారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు(సిల్ట్)ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు చెప్పారు.

మ్యాన్ హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ కు ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేసనట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. వీరంతా ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా HMWSSB ACT – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరమని పేర్కొంటున్నారు. అందుకే ఎవరూ మ్యాన్ హోల్ తెరవొద్దని స్పష్టం చేస్తున్నారు.