National

నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం చారిత్రక ప్రకటన చేసింది.

 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది.

 

అంతకుముందు సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన 90 నిమిషాలపాటు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.