APNational

సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల/తిరుపతి: కలియుగ వైకుంఠదైవ శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో (tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు (brahmotsavam) దర్శనమిచ్చారు.

తిరుమలలో కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప !

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి (tirumala) వాహనసేవ కోలాహలంగా జరిగింది.

సర్వభూపాల వాహనంలో (brahmotsavam) విహరిస్తున్న శ్రీవారిని (tirumala) దర్శించుకోవడానికి గురువారం సాయంత్రం నుంచి వేలాది మంది భక్తులు వెయ్యి కళ్లతో వేచి చూశారు.

యశోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు (brahmotsavam) కూడా చేరతారు. తూర్పుదిక్కుకు (tirumala) ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.

వీరందరూ స్వామివారిని (tirumala) తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో (tirumala) ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ (brahmotsavam)నుంచి గ్రహించవచ్చు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ .ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (tirumala) భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు (tirumala) తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు (brahmotsavam)చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దగల శ్రీ పెద్దజీయర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు.

తిరుమల బ్రహ్మోత్సవాల్లో చెన్నై గొడుగుల ప్రత్యేకత ఏమిటింటే, గరుడసేవ !

అక్కడ తిరుమల (tirumala) శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడినుంచి (brahmotsavam) టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈవో ముత్తురాజ్, ట్రస్టుబోర్డు సభ్యుడు మనోహరన్ పూలమాలలను తీసుకు తిరుమల చేరుకున్నారు.

తిరుమలలోని (tirumala) శ్రీవారి ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరు నుండి (tirumala) గోదాదేవిమాలలను తిరుమల (brahmotsavam) శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వీటిని గరుడసేవలో స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు.