అల్లూరి జిల్లా దేవిపట్నం..
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు పేట గ్రామంలో అన్ని పార్టీల మండల నాయకుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గోళ్ళ చంటిబాబు రాష్ట్ర sc సెల్ కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ నీ స్మరించుకోవడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ వేత్త బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన నాయకులు సుదీర్ఘంగా 40 ఏళ్ల పాటు భారత పార్లమెంటులో పనిచేసిన సమర్థులు అని ఆయన అన్నారు. అనేక శాఖలలో మంత్రిగా భారతదేశానికి ఉప ప్రధానిగా ఆయన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. నేటి తరం యువత బాబు జగ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నా