National

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.

2024 నుంచి అన్ని వీడియో షోలు, సినిమాల్లో ప్రకటనలను చేర్చుతున్నట్లు అమెజాన్ తెలిపింది. యూకే, యూఎస్, జర్మనీ, కెనడాల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి యాడ్స్-సపోర్టు ఉన్న ఆఫర్లు ప్రారంభమవుతాయని, ఆ తరువాత ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ,మెక్సికో, ఆస్ట్రేలియాల్లో కూడా యాడ్ – సపోర్టెడ్ ఆఫర్లు ప్రారంభవుతాయిని అమెజాన్ తెలిపింది.

 

అయితే స్టాండర్డ్ ఫ్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర మారదు. మిగతా ఫ్లాట్‌ఫారాల్లాగే చందాదారులు అదనంగా డబ్బులు పే చేసి యాడ్స్ ఫ్రీ కంటెంట్ పొందవచ్చు. సప్లిమెంటల్ యాడ్ ఫ్రీకి అమెరికాలో 2.99 డాలర్లను నెలకు ఛార్జ్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. అయితే మిగతా దేశాల్లో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

గత సంవత్సరం, డిస్నీ+ యునైటెడ్ స్టేట్స్‌లో యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది, ఇది యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కంటే చౌకైనది, ఆపై దానిని యూరప్‌కు విస్తరించింది. దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ రకమైన ఆఫర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారమ్స్ తక్కువ ధరతో యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకువచ్చి సబ్‌స్క్రైబర్లను పొందాలని చూస్తున్నాయి, దీంతో పాటు పాస్ వర్డ్ షేరింగ్ తగ్గించి వినియోగదారులను పెంచుకోవలని అనుకుంటున్నాయి.