జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నిన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. అయితే దాడిలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న దాడి తర్వాత ముగ్గురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని ఇండియన్ ఆర్మీ తన అధీనంలోకి తీసుకొని.. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ చేపట్టింది.