లోక్సభ ఎన్నికలకు ముందు చివరిసారిగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్లో మహిళా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని రెట్టింపు చేస్తారని భావిస్తున్నారు.