భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యువ విజ్ఞాని కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్’లో తెలిపింది. ‘క్యాచ్ దెమ్ యంగ్’ పేరిట రెండు వారాల పాటు అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1కి 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులు అర్హులుని తెలిపారు.