National

స్వలింగ వివాహాలకు గ్రీన్‌సిగ్నల్..

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా గ్రీస్‌లో అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లుకు తాజాగా గ్రీస్ పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. తద్వారా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది. దీంతో గ్రీస్ ప్రభుత్వానికి LGBT సమాజం ధన్యవాదాలు తెలిపింది. స్వలింగ వివాహాలకు ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాలు మద్దతు ఇస్తున్నాయి.