National

రైతులపై కేంద్రం కనకవర్షం.. .

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికోసం రైతులు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. పది నిముషాలు కేటాయిస్తే చాలు. వారి ఖాతాల్లోకి డబ్బు వస్తుంది. కేంద్రం ఇటీవలే 16వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. మొత్తం 75 లక్షల మంది రైతులకు ప్రస్తుత విడతతో పాటు చివరి విడత కూడా ఇచ్చారు.

 

ప్రస్తుతం 40 లక్షల మంది రైతులు దీన్ని పొందుతున్నారు. అయితే EKYC లేదా ఆధార్ లింక్ లేకపోవడంతో కొందరి ఖాతాల్లో డబ్బు పడలేదు. వీరికి వాయిదాలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు వెంటనే తమ EKYC లేదా ఆధార్‌ని బ్యాంక్‌తో లింక్ చేయించుకోవాలి. దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు. రైతులు తమ ఫోన్‌లో PM కిసాన్ యాప్‌ను అప్‌లోడ్ చేసుకొని EKYC చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న సాధారణ సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడ కూడా అప్ డేట్ చేయించుకోవచ్చు. దీనివల్ల వెంటనే నిలిచిపోయిన వాయిదాలను తిరిగి పొందొచ్చు.

 

రైతులు ఈ లింక్ https://chatbot.pmkisan.gov.in/Home/Index ఉపయోగించి కూడా వాయిదాల కారణాన్ని తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నెంబరును, కార్డ్ నంబర్‌ను నమోదు చేస్తే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.

 

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడిని తగ్గించడానికి ఏడాదికి రెండుసార్ల చొప్పున కొంత నగదును పంపిణీ చేస్తుంది. ఈ పథకం స్ఫూర్తితో భారత ప్రభుత్వం ఈ తరహా పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో డిసెంబర్ 1, 2018 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనికింద ఏడాదికి రూ.75,000 కోట్లు కేటాయించారు.