National

మెజారిటీ మార్క్ దాటేసిన బీజేపీ.. ఎర్రకోటపై కాషాయం జెండా..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారీటీని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 36 గా ఉంది. బీజేపీ ఇప్పటికే 48 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ దేశరాజధానిలో కాషాయం జెండా ఎగురవేయనున్నట్లు తెలుస్తోంది.

 

2020 ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమిత మైంది. ఈ సారి మాత్రం భారీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు దక్కాయి. 53.57శాతం ఓట్లు రాబట్టింది. బీజేపీ 38.51శాతం ఓట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. 4.26శాతం ఓట్లు వచ్చాయి.

 

2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 67 సీట్లు దక్కాయి. బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3శాతం దక్కింది. బీజేపీకి 32.2శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. ఎన్నికల్లో 9 శాతం ఓట్లు దక్కాయి.

 

కాంగ్రెస్ ఖేల్ ఖతం..

 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖేల్ ఖతం అయినట్లే అని రాజకీయ నిపుణులు చర్చిస్తున్నారు. దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన 1952-2020 మధ్య 8 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 4 సార్లు మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేక పోయింది. 2015, 2020 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఒకే చోట లీడింగ్ లో కొనసాగుతోంది. కౌంటింగ్ ముగిసేనాటికి ఆ ఒక్కసీటు కూడా డౌటే అని వినిపిస్తోంది.