CINEMANational

14 కిలోల బంగారంతో పట్టుబడిన కన్నడ నటి…

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ హీరోయిన్ రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆమె నుంచి 14 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తను సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తెనని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ పోలీసులు ఆమెపై అక్రమ బంగారం రవాణా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు ఆమెకు సొంత తండ్రి కాదు, సవతి తండ్రి. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ తను తమని కలవలేదని వెల్లడించారు. తన గురించి గానీ, తన భర్త చేసే వ్యాపారం గురించి కానీ తమకేమీ తెలియదని ఆయన పేర్కొన్నారు. జరిగిన విషయం తెలిసి తామంతా షాకయ్యామని, ఎంతో నిరాశ చెందామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

కాగా, రన్యా‌రావు ఏడేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. హీరో సుదీప్ దర్శకత్వంలో వచ్చిన మాణిక్య మూవీలో ఆమె సహాయ నటిగా నటించింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్ గా నటించింది. తమిళంలో వాఘా మూవీలో నటించింది.