CINEMA

ఇప్పుడు ‘హిట్ వర్స్’ అనే పేరు ప్రచారంలోకి

ఆ మధ్య ‘విక్రమ్’ సినిమా విషయంలో ‘లోకి వర్స్’ అనే పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ‘హిట్ వర్స్’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ తీసే సినిమాలు ఒకదానితో ఇంకోటి లింక్ అన్నట్లు వుంటాయి. అందుకే ‘లోకి వర్స్’ అని పిలుచుకుంటున్నారు తమిళ తంబీలు. ఇక, ‘హిట్ వర్స్’ విషయానికి వస్తే, తొలుత ‘ హిట్ ‘, ఇప్పుడేమో ‘హిట్ రెండో కేస్’.. వెరసి, ఇదొక ‘హిట్ వర్స్’ అయిపోయింది. ‘హిట్-2’తో సూపర్ సక్సెస్ అందుకున్న అడివి శేష్‌ని ఓ అభిమాని, ‘హిట్ వర్స్’లోకి మహేష్‌బాబుని తీసుకొచ్చెయ్యండంటూ కోరాడు. అడివి శేష్‌ని అభినందించిన మహేష్.. ‘హిట్-2’ సినిమాకి వస్తున్న స్పందన నేపథ్యంలో మహేష్ కూడా తనకు ఫోన్ చేసి అభినందించినట్లు అడివి శేష్ చెప్పాడు.

మహేష్ నిర్మాతగా ‘మేజర్’ సినిమా తెరకెక్కగా, అందులో అడివి శేష్ నటించిన సంగతి తెలిసిందే. ‘ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేం. సూట్ అవుతుందో లేదో ఆలోచించాలి.. మహేష్ మాత్రం నాకు ఫోన్ చేసి అభినందించారు. మహేష్‌కి సోదరుడిగా ఎప్పుడూ ఆయన కోసం వుంటా. ఆయనకు హిట్-2 సినిమాని చూపించడానికి సిద్ధంగా వున్నా..’ అంటూ అడివి శేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఏమో, ‘హిట్-2’ నుంచి ముందు ముందు భారీ సినిమాలు.. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, పాన్ వరల్డ్ సబ్జెక్ట్స్ అయితే.. మహేస్ కూడా అందులో భాగం పంచుకునే అవకాశం లేకపోలేదు. నేచురల్ స్టార్ నాని ‘హిట్-2’ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే.