యూపీఐ (UPI) అనేది భారతదేశంలో రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ, ఇది మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాల మధ్య డబ్బును తక్షణమే బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది.యూపీఐ లావాదేవీలు తక్షణమే జరుగుతాయి.అయితే ఇప్పటి వరకు ఫ్రీగా ఈ సేవలు అందించడం జరిగింది. యూపీఐ చెల్లింపుల అధిక మొత్తంలో జరగడంతో వీటిపై వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల త్వరలోనే రూపే డెబిట్ కార్డుల, యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలను వసూలు చేసే ఆలోచన ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే యూపీఐ చెల్లింపులు కూడా ఉచితం కాదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ ఛార్జీలు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.అయితే, వ్యాపారులు లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సి వస్తే, అది వినియోగదారులపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చు.2022కు ముందు, యూపీఐ లావాదేవీలకు వ్యాపారులు బ్యాంకులకు MDR ఛార్జీలు చెల్లించేవారు.అయితే, 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ ఛార్జీలను తొలగించింది.ప్రస్తుతానికి ఈ ఛార్జీలు తిరిగి విధించే ఆలోచనలు ఉన్నాయి.
ప్రభుత్వ మద్దతు తగ్గడం వలన యూపీఐ యాప్ లు నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డాయి. అందువలన యూపీఐ యూజర్లనుంచి కన్వీనియెన్స్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి.
నేరుగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన UPI లావాదేవీలు మాత్రం ఛార్జీలు ఉండవు. రూ. 2000 కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేస్తే ట్రాన్సాక్షన్ విలువలో 1.1 శాతం సుంకం (UPI Surcharge) విధిస్తామని ఎన్‌పీసీఐ తెలిపింది.రూ.40 లక్షల వార్షిక జీఎస్టీ టర్నోవర్ కలిగిన వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని, దీనికంటే తక్కువ వ్యాపారం కలిగిన వ్యాపారులకు ఉచితంగా సేవలను అందించాలని యూపీఐ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని కంపెనీల యాజమాన్యాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.త్వరలోనే యూపీఐ ఛార్జీలు వసూలు చేయడంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.