ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్ టాక్ మళ్లీ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. గురుగ్రామ్ లోని తమ కార్యాలయంలో ఉద్యోగులను నియామించుకోవడానికి టిక్ టాక్ నోటిఫికేషన్ జారీ చేయడం సందేహాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన, డ్రాగన్ అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ నేపథ్యంలో టిక్ టాక్ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేసే ఉద్దేశంలేదని వెల్లడించాయి. ఇటీవల టిక్‌టాక్ వెబ్సైట్ అనేకమంది యాక్సెస్ చేయగలుగుతున్నారు. అయితే.. లాగిన్ కావడం, వీడియోలను చూడటం సాధ్యం కావడంలేదు.
టిక్ టాక్ నోటిఫికేషన్
గురుగ్రామ్‌లోని తన ఆఫీస్‌లో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టిక్ టాక్ తాజాగా లింక్డిన్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ కాగా, మరొకటి నాయకత్వానికి సంబంధించిన పోస్టు.