దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన పట్టును కోల్పోయి, కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయిలోనూ, క్షేత్ర స్థాయిలోనూ కాంగ్రెస్ బలహీనపడుతోంది. దీనికి ప్రధాన కారణం, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడటమే. కర్ణాటక, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ జాతీయ పార్టీగా సొంతంగా పోటీ చేసి అధికారాన్ని సాధించినప్పటికీ, మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లపై ఆధారపడి రాజీ ధోరణిలో ఉండాల్సి వస్తుంది.
దశాబ్దాల క్రితం, నెహ్రూ కాలం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలోనూ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టు, పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండేది. కానీ రానురాను, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోకి వచ్చేసరికి ఈ కీలక రాష్ట్రాల్లో పార్టీ పట్టు కోల్పోయింది. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ అనుకోవడమే, ఆ పార్టీ తనకు తానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది.
ఈ పరిస్థితి బీహార్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మహా ఘట్ బంధన్ (MGB) కూటమిలో ఉన్నప్పటికీ, బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం (AIMIM) కంటే కూడా తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉండటం గమనార్హం. దీనిని బట్టి చూస్తే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లు అర్థమవుతోంది. అందుకే, రాహుల్ గాంధీ డైలాగ్‌ను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ “ఖేల్… ఖతం… బైబై… టాటా… గుడ్ బై… గయా” అన్న డైలాగ్ గుర్తుకువస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

