National

అదానీ NDTV ఆఫర్‌కు స్పందన అంతంతే!

న్యూఢిల్లీ టీవీలో (NDTV)లో 26 శాతం అదనపు వాటా కోసం అదానీ గ్రూప్‌ చేసిన ఓపెన్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఓపెన్‌ ఆఫర్‌ ధరకన్నా… మార్కెట్‌లో అధిక ధర పలుకుతుండటంతో ఇన్వెస్టర్లు ఎవరూ షేర్లు అమ్మడానికి ముందుకు రావడం లేదు. మంగళవారం ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 5తో ముగియనుంది.

ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు 28 లక్షల షేర్లకు మాత్రం ఆఫర్స్‌ వచ్చాయి. ఓపెన్‌ ఆఫర్‌ కింద 1.67 కోట్ల షేర్లను కొంటామని అదానీ పేర్కొంది. ఆఫర్‌లో కేవలం 16 శాతం షేర్లకు మాత్రమే ఇప్పటి వరకు ఆఫర్లు వచ్చాయి ఈ ఆఫర్‌లో ఒక్కో షేరుకు రూ.294లను అదానీ గ్రూప్‌ ఆఫర్‌ చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో నిన్న కూడా క్షీణించిన ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ 2.36 శాతం అంటే రూ. 8.45 పెరిగి రూ.367 వద్ద ముగిసింది. ఆఫర్‌ ధరతో పోలిస్తే ఇది 25 శాతం కన్నా అధికం.