ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరుగునుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు పోటి పడ్డాయి.. అయితే రెండుసార్లు గుజరాత్ విజేతగా నిలిచింది. కానీ ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పటిష్టంగా ఉంది. యువ ప్లేయర్స్ తో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఈసారి జట్టులో ఉన్నారు. బెన్ స్టోక్స్, MS ధోని, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు మరియు రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లను కలిగి ఉంది. స్టోక్స్‌ను జట్టులోకి తీసుకోవడంతో మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడమే కాకుండా జట్టుకు మరో కెప్టెన్ కూడా దొరికాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ వారి ప్రదర్శనతో ఆకట్టుకుంది. హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు మునుపటి సీజన్‌లో అన్నింటిలో అద్భుతమైన ప్రదర్శన చేసి కప్ కొట్టింది. హార్ధిక్ పాండ్యా బ్యాట్, బంతితో అద్భుతంగా ఆడాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన జట్టుకు ఎంతగానో సహాయ పడింది.హార్దిక్ తో పాటు జట్టులో మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ మరియు రాహుల్ తెవాటియా కూడా ఉన్నారు. GT vs CSK యొక్క IPL 2023 పోటీకి ముందు గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండుసార్లు తలపడింది. అయితే రెండు సమయాల్లో టైటాన్స్ విజేతగా నిలిచింది. మార్చి 29, 2022న ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. 170 పరుగుల ఛేదనలో పాండ్యా నేతృత్వంలోని జట్టు ఇబ్బందుల్లో పడింది.. అయితే డేవిడ్ మిల్లర్ 94 మరియు రషీద్ ఖాన్ 40 పరుగుల స్కోరుతో మ్యాచ్ ఓడిపోకుండా వారిని కాపాడి మూడు వికెట్ల తేడాతో గెలిచారు.
ఇరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో తక్కువ స్కోరు నమోదు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై మొత్తం 133/5 స్కోరు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (సి), శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ షమీ, జాషువా లిటిల్
చెన్నె సూపర్ కింగ్స్ : మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), అంబటి రాయుడు, దీపక్ చాహర్, డేవాన్ కాన్వే, డ్వెన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, మతీష పతీరాణ, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, రాజవర్థన్ హంగార్గేకర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.