SPORTS

విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్

టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత జట్టు ఆ బాధలో ఎక్కువ రోజులు గడపడానికి టైం లేదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టు బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఓటమి తర్వాత భారత జట్టు స్వదేశానికి రాదు. కొందరు ఆటగాళ్లు మినహా అందరూ న్యూజిల్యాండ్‌కు వెళ్తారు. విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా నుంచి టీమిండియా స్వదేశం రావడానికి లేదు.

అక్కడి నుంచి నేరుగా న్యూజిల్యాండ్ చేరుకుంటుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్ జట్టు పగ్గాలు అందుకుంటాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. సీనియర్లకు విశ్రాంతి.. సీనియర్లకు విశ్రాంతి.. కివీస్ సిరీస్‌లో వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్లు ఆడరు. వీళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కివీస్ గడ్డపై వైట్ బాల్ సిరీసులు ముగిసిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ వెళ్తుంది. అక్కడ వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడుతుంది.

బంగ్లా సిరీస్‌లో విరాట్, రోహిత్ తదితర వెటరన్ ఆటగాళ్లు కూడా జట్టుతో కలుస్తారు. స్వదేశంలో మూడు సిరీస్‌లు స్వదేశంలో మూడు సిరీస్‌లు బంగ్లా పర్యటన నుంచి భారత జట్టు స్వదేశానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలతో స్వదేశంలో సిరీస్‌లు ఆడుతుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత కివీస్‌తో కూడా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ బిజీ షెడ్యూల్‌ ఏడాది చివరి వరకు కొనసాగుతుంది.