భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్న ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో మరింత ఆనందలో మునిగిపోయారు. 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ మినీ వేలం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లేదా బెంగళూరులో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, బీసీసీఐ తాజాగా ఈ వేలం కోసం కేరళలని కోచిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.