రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంగ్ టర్మ్ ప్లాన్‌ను అందిస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) ఆఫర్ కింద రూ.2999తో ఏడాది కాల వ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతోపాటు ఉచితంగా రూ. 5800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది.
ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. రూ. 2999తో రీఛార్జీతో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక అపరిమితి వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లతోపాటు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా లభిస్తుంది. అంతేగాక, జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను ఏడాదిపాటు ఉచితంగా వీక్షించవచ్చు.
ఇక స్విగ్గీ, యాత్ర, అజియో, నెట్‌మెడ్స్, రిలయన్స్ డిజిటల్ కొనుగోలుపై రూ. 5800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ కూపన్ల విషయానొకిస్తే.. స్విగ్గీలో రూ. 240 కంటే ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ. 100 డిస్కౌంట్ లభిస్తుంది. యాత్ర సాయంతో విమానాలు బుక్ చేసుకుంటే.. రూ. 1500 డిస్కౌంట్, హోటళ్లలో రూ. 4 వేల కంటే ఎక్కువ వెచ్చిస్తే అందులో 15 శాతం వరకు రాయితీ పొందవచ్చు.
అజియో(Ajio)లో రూ. 999 కొనుగోలుపై రూ. 200 రాయితీ అందిస్తోంది. నెట్‌మెడ్స్(Netmeds) ద్వారా రూ. 999కి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్‌లో కొన్ని ఎంపిక చేసిన ఆడియో పరికరాలు, గృహోపకరణాలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ అందుకునేందుకు రూ. 2999తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.