Technology

స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ మీకు తెలుసా?

ఇండియాలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు బెస్ట్ 5 వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం నేల మీద మాత్రమే కాదు నీటిలో ముగినా కూడా ఎటువంటి నష్టం వాటిళ్లకుండా తట్టుకొని నిలబడగలవు. అంతేకాదు, కొన్ని ఫోన్స్ అయితే స్విమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటో లను చిత్రించగలిగిన సత్తాను కలిగి ఉంటాయి. మరి ఇండియాలోని ఇటువంటి సత్తా కలిగిన టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లు గురించి తెలుసుకోండి.

Apple iPhone 14 pro Max

ఇండియాలో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లలో టాప్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ గా Apple iPhone 14 pro Max నిలుస్తుంది. యాపిల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ 6.7 ఇంచ్ బిగ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 1600 పీక్ బ్రైట్నెస్ ను అందించగలదు. ఈ ఫోన్ 48MP+12MP+12MP సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ తో మీరు సిమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు.

Samsung Galaxy S22 Ultra

శామ్సంగ్ యొక్క ప్రమియం సిరీస్ స్మార్ట్ ఫోన్ Galaxy S22 Ultra కూడా టాప్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ తో మీరు సిమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ కూడా IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా 6.8 ఇంచ్ బిగ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 1750 పీక్ బ్రైట్నెస్ ను అందించగలదు. ఈ ఫోన్ 108MP+10MP+10MP+12MP సెటప్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది.

Apple iPhone 14

యాపిల్ యొక్క 14 సిరీస్ యొక్క బేసిక్ వేరియంట్ Apple iPhone 14 కూడా బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ యాపిల్ ఐఫోన్ 6.1 ఇంచ్ Super రెటీనా XDR డిస్ప్లే తో వస్తుంది మరియు ఇది 1200 పీక్ బ్రైట్నెస్ ను అందించగలదు. ఈ ఫోన్ 12MP+12MP సెటప్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ తో కూడా మీరు సిమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు.

Google Pixel 7 Pro

గూగుల్ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Google Pixel 7 Pro కూడా బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఫోన్ తో మీరు సిమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ కూడా IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ QHD+ డిస్ప్లే తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 1500 పీక్ బ్రైట్నెస్ ను అందించగలదు. ఈ ఫోన్ 50MP+48MP+12MP సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది.

Vivo X80 Pro

Vivo X80 Pro స్మార్ట్ ఫోన్ కూడా IP68 ఇన్గ్రెస్ ప్రొటెక్ష తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంటే, ఈ ఫోన్ కూడా ఇండియాలోని టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ LTPO2 AMOLED డిస్ప్లే ని QHD+ రిజల్యూషన్ తో కలిగింవుంది. ఈ ఫోన్ 50MP+48MP+12MP+8MP సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది.