TELANGANA

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఓ సభలో అయ్యప్ప స్వామి సహా శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. భైరి నరేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని కోరారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నరేష్ రెండు రోజుల నుంచి పరారీలో ఉన్న సంగతి తెలి

సిందే. అయ్యప్ప స్వామి గురించి భైరి నరేష్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి పుట్టుకపై నరేష్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేశారు. నరేష్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్‌ నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అ‍య్యింది. Also Read: RTC Bus accident: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్‌ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేష్‌పై మండిపడుతున్నారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేష్‌. అయ్యప్ప స్వామి జననాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో భైరి నరేష్‌పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది.