తన పార్లమెంట్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడంపై కాంగ్రెస్ ముఖ్య నేత, రాహుల్ గాంధీ స్పందించారు. చాలా ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. దేశం కోసం గళం విప్పుతానని, ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తాను భారతదేశ స్వరం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు రాహుల్. దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. మరోవైపు ప్రముఖ రాజకీయ నేతలు రాహుల్ అనర్హత వేటుపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా, సీపీఎం సీతారాం ఏచూరి రాహుల్ అనర్హతవేటుపై స్పందించారు. రాహుల్ డిస్‌క్వాలిఫికేషన్ ట్విట్టర్ వేదికగా బీజేపీ చర్యలను ఖండించారు.
ఏఐసీసీ అత్యవసర భేటీ..
ఇదిలాఉంటే.. రాహుల్ అనర్హత నేపథ్యంలో AICC అత్యవసరభేటి అయ్యింది. కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు హాజరయ్యారు. స్టీరింగ్ కమిటీ నేతలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై చర్చించారు. రెండేళ్ళ జైలు శిక్ష నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయాలన్నదానిపై చర్చించారు.