సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండో వందేభారత్ రైలును గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. తొలి రోజు(ఏప్రిల్ 8) ఈ ట్రైన్ ఉదయం 11. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఆ తేదీన నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు లాంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగి.. రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.