పార్వతీపురం మన్యం జిల్లా
గిరిజనలు సాగుచేసుకుంటున్న భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం లు కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం పెడమరికి పంచాయితీ శివం దొరవలస, చిన మరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలిసి సమస్యను తెలియజేశారు. గతంలో పట్టణానికి చెందిన మాజీ సైనికడు కి ప్రభుత్వం వారు నిబంధనల ప్రకారం కొంత భూమిని కేటాయించాగా .. సదరు ఆ వ్యక్తి ఆభూమితో పాటు మరికొంత భూమిని ఆక్రమించుకొని గిరిజనులు వేసిన కంది మొక్కలను తన మనుషులతో పీకి వేశారని, ఈ విషయాన్ని గతంలో జిల్లా అధికారులకు తెలియజేసినా నేటికీ ఏ చర్యలు తీసుకోలేదని వాపోయారు. కావున తమరు స్పందించి గిరిజనలకు చెందిన భూమిని గిరిజనులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెళ్లికి. చిన్నారావు, కొండ గొర్రి. శశిరేఖ, శిర పాడు. మంగ, రాణి ,భారతీ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు