అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22, 2023నాటికి సిపిఐ (యమ్.యల్) లిబరేషన్ పార్టి ఆవిర్భవించి 54 సంవత్సరాలయిందని అందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.