ప్రభుత్వ కార్యాలయాలకు పేదోళ్ళ భూములను లాకుంటున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. 33 జిల్లాల్లో ప్రభుత్వ భూములు రూపాయి లీజ్ పేరిట తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
కేబినెట్ మీటింగ్ తరువాత మంత్రి అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో 11 ఎకరాల విలువైన స్థలాన్ని ఓ సంస్థ పేరుమీద తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోకాపేట భూముల మీద కేబినెట్ మీటింగ్ జరిగింది.. కానీ అది చెప్పలేదని, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలకు కేవలం 40 కోట్లు మాత్రమే ఇచ్చారని, 550 కోట్ల విలువ ఉంటదని, కానీ 40 కోట్లు కట్టారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పని చేస్తారని, అది జానా రెడ్డి కోమటి రెడ్డి చెప్పారని బండి సంజయ్ అన్నారు. కలసి పని చేస్తారు కాబట్టి మహేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వచ్చారన్నారు. కోకా పేట భూములను స్వాధీనం చేసుకుంటామని, ఆ భూమి పేదోళ్లకు డబుల్ బెడ్రూం కోసం ఇవ్వాలన్నారు.
Also Read :
Uttarakhand: ముస్లిం వ్యక్తితో బీజేపీ నేత కుమార్తె వివాహం.. సోషల్ మీడియాలో పెళ్లి పత్రిక వైరల్.. పెళ్లి రద్దు..
కోకాపేట భూముల కోసం ఆందోళన చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ కలిసే పని చేస్తాయని, కాంగ్రెస్ లో నాలుగు స్తంభాల ఆట సాగుతుందన్నారు. రెండు పార్టీలు కలిసి అధికారం పంచు కుంటాయని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం సర్వేలో బీజేపీ అధికారంలోకి వస్తది అని తేలిందన్నారు. అది బయటకు వచ్చిందని, 111 జీఓ పెద్ద స్కాం అని.. ప్లాన్ ప్రకారం కొని ఇప్పుడు అమ్ముకుంటున్నారన్నారు. అక్కడ అన్ని ఫార్మ్ హౌస్ లే అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ బండి సంజయ్‌పై వ్యతిరేకత ఉందని వార్తలు వస్తుండటంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై వ్యతిరేకత అనే ది తప్పు అన్నారు. ఒక్క సెక్షన్ మీడియా, విశ్లేషకులు కేసీఅర్ అడుగులకు మడుగులు ఒత్తడం మంచి ది కాదని, విలువ తగ్గించు కోకండి… నా రిక్వస్టే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.