NationalTELANGANA

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం

విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలి..

విభజన సమస్యలపై పట్టింపులకు పోవద్దు.. లోక్ సభ స్థానాలు పెంపు రాజ్యాంగ పరమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. పునర్విభజన చట్టం ఉంది.. దక్షిణ భారత్ కు చెందిన రాష్ట్రాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. సౌత్- నార్త్ కు లింక్ పెట్టొద్దు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

 

దక్షిణాది నుంచి కూడా ప్రధానులు అయ్యారు.. బీజేపీలో చేరిన వారు.. మళ్ళీ వెళ్లి పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రాష్ట్రంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ లు కలిసి కుట్రలు చేస్తున్నాయి అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలెందుకు కాంగ్రెస్ బలంగా ఉండాలని కేసీఅర్ కోరుకుంటున్నారు.. లక్షలాది మంది యువత బీజేపీ పార్టీలో చేరుతోంది అని గుర్తు చేశారు. కొందరు చేరనంత మాత్రానా పార్టీకి కలిగే నష్టం ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నిరాశ నిస్ర్పృహ లో లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.