రాష్ట్రం అడవుల విస్తీర్ణంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని, మున్సిపల్ వ్యర్థాల శుద్దిలో అగ్రస్థానంలో ఉందని అటవీ పర్యావరణ, సైన్సు, టెక్నాలజీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం సనత్‌నగరలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రోజులకు 1082 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో 747 టన్నులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగ పడుతున్నాయన్నారు. 345 టన్నుల చెత్తను మున్సిపల్ వ్యవస్థ సమర్దవంతంగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం టిఎస్‌పిసిబి చైర్మన్ రాజీవ్‌శర్మ ప్రసంగిస్తూ రాష్ట్రంలో మొత్తం 603 ఎంఎల్డీ పారిశ్రామిక మురుగునీటి ఉత్పత్తి చేస్తున్నట్లు, సిఈటిపితో సహా ప్రస్తుతం శుద్ది సామర్దం 609 ఎంఎల్డీకి శుద్దికి సరిపోతుందన్నారు. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఈ వ్యర్థాలను వినియోగదారుల నుంచి పంపడం ద్వారా ఈ వ్యర్థాలను నిర్వహించడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో వందశాతం మురుగునీటి శుద్దిలో దేశంలోనే మొదటి నగరంలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నట్లు పర్యావరణ ప్రత్యేకాధికారి డా. రజత్‌కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో ఈపిటిఆర్‌ఐ డైరెక్టర్ వాణీ ప్రసాద్, ప్రొపెసర్ జయతీర్దరావు, రఘ తదితరులు పాల్గొన్నారు.