APTELANGANA

మరో భారీ షాక్- సిలబస్ కోతలపై నిరసన-తమ పేర్లూ తీసేయాలని 33 మంది నిపుణుల లేఖ..

నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి మరో షాక్ తగిలింది. కరోనా తర్వాత విద్యార్ధులపై భారం తగ్గిస్తున్నామన్న పేరుతో పాఠ్యపుస్తకాల్లో చరిత్రలో పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న NCERTకి నిపుణులు, సలహాదారులు వరుసగా షాక్ లు ఇస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా మరో 33మంది నిపుణులు పాఠ్యపుస్తకాల్లో తమ పేర్లు కూడా తీసేయాలని కోరుతూ NCERTకి ఓ సంచలన లేఖ రాశారు.

టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో వివిధ దశల్లో భాగస్వాములుగా ఉన్న 33 మంది మేధావుల బృందం సిలబస్ లో ఏకపక్షమార్పులకు నిరసనగా పాఠ్యపుస్తకాల నుండి తమ పేర్లను తొలగించాలని NCERTని కోరారు. విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకూ వీరంతా పొలిటికల్ సైన్స్ కు సంబంధించి అద్భుతమైన పాఠ్యపుస్తకాలు తయారు చేసిన వారిగా వీరికి పేరుంది. అయితే NCERT ఇప్పుడు ఈ పాఠ్యపుస్తకాల్లో అనేక కీలకమైన మార్పులు, తొలగింపులు చేసింది.