అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా.
దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు.
తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల ఫొటోలను రిలీజ్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను తమిళనటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. దీని తరువాత వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ వచ్చారు.