: ‘గాయంగాని చేశారంటే ఖాయంగా దేవున్నవుతాను’ ఇది పుష్ప సినిమాలో ఏయ్ బిడ్డా అనే పాటలో ఒక చరణం. ఇది అచ్చు గుద్దినట్టు అల్లు అర్జున్ కు సరిపోతుంది.
అల్లు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ నెగెటివిటీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అల్లు అర్జున్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా ‘నా పేరు సూర్య’ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో విపరీతమైన నెగెటివిటీ అల్లు అర్జున్ మీద స్ప్రెడ్ అయింది. అద్భుతమైన డాన్సర్, హావభావాలు అద్భుతంగా పలికిస్తాడు. డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉంటుంది. అయినా ఎక్కడో తేడా కొడుతోంది. అదే అల్లు అర్జున్ ను సినిమాకు రెండు సంవత్సరాలు పాటు దూరం అయ్యేలా చేసింది.
ఈ రెండు సంవత్సరాలలో అల్లు అర్జున్ తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ మార్చుకున్న విధానాన్ని ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో ఏంట్రా గ్యాప్ ఇచ్చావని మురళి శర్మ అంటే.. గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అని బదులిచ్చాడు. ఆ డైలాగ్ పలుకుతున్నప్పుడు అల్లు అర్జున్ ముఖంలో హావభావాలు కూడా అతడి బాధను వ్యక్తీకరించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ రేంజ్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఏకంగా అది నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. అందులోని పాటలు ముఖ్యంగా రాములో రాములా, బుట్ట బొమ్మ పాటలు యూట్యూబ్లో కొత్త రికార్డును సృష్టించాయి. ఇక్కడితోనే అల్లు అర్జున్ తన పై ఏర్పడిన నెగెటివిటీకి పూర్తిగా సమాధానం చెప్పలేదు.
అల వైకుంఠపురంలో తర్వాత తన డార్లింగ్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయితే.. మొదటి రెండు రోజులు విపరీతమైన డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత బౌన్స్ బ్యాక్ లాగా తెలుగు బాక్స్ ఆఫీస్ ను మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమానే ఒక ఊపు ఊపేసింది. ఇందులోని పాటలు, డైలాగులు, అల్లు అర్జున్ యాక్టింగ్ నార్త్ ప్రేక్షకులకు విపరీతంగా నచేశాయి. ఎంతలా అంటే ఒక డబ్బింగ్ సినిమా ఏకంగా 100 కోట్లు అక్కడ కొల్లగొట్టేసింది. ఇప్పుడు పుష్ప _2 కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందంటే దానికి కారణాలు పైవే. ఒక రెండు సంవత్సరాలు పాటు సినిమా తెరకు దూరమైన అల్లు అర్జున్.. తన కసిని మొత్తం ఇప్పుడు చూపిస్తున్నారు. అవార్డు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటని విలేకరులు అడిగితే ‘షాక్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను’ అని అల్లు అర్జున్ చెప్పాడంటే ఈ అవార్డు అతడికి ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది.