ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ల స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్‌ను అన్న అంటూ కేటీఆర్ ఎప్పుడు గౌరవిస్తునే ఉంటారు.
ఆ మధ్య తెలంగాణ దేవాలయాలను కూడా అభివృద్ది చేయాలని కోరగానే సీఎం జగన్ దానికి తగిన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆరే స్వయంగా మీడియాకు తెలిపారు.
పార్టీ నుంచి బయటకు గెంటేసి ..ఇప్పుడు ఏడుపులా.. టీడీపీపై మండిపడ్డ తమ్మారెడ్డి
తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ సీఎం జగన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి కేటీఆర్ ప్రస్తుతం వరంగల్ పర్యటనలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా క్యాడ్రంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఇక మీదట ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎక్కడిక్కడక్కడే పరిశ్రమలను పెట్టాలన్నారు. బెంగళూరులో 40 శాతం మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఐటీ ఉద్యోగులుగా పని చేస్తున్నారని.. వారంతా తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఏపీలో భీమవరం, నెల్లూరు , విశాఖ ప్రాంతాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. అక్కడ గొప్పగా ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని, అవసరమైతే జగనన్నకు చెప్పి అక్కడ స్థలం ఇప్పించే బాధ్యత తనదని..క్యాడ్రంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏపీలో కూడా స్థాపించాలని కంపెనీ యాజమానులకు కేటీఆర్ సూచించారు.
కేటీఆర్ నుంచి జగన్ పేరుగా రాగానే .. సభలో ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేశారు. ఈ సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అందరూ బాగుంటేనే దేశం బాగుటుందన్నారు. దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే ఎక్కడివారికి అక్కడే ఉపాధి దొరకాలన్నారు. దీనిలో భాగంగానే మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.