‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్ ఇస్తాం.. అందరూ నియోజకవర్గాల్లో ఉండే పనిచేసుకోండి. వారుసులెవరికీ ఈసారి టికెట్లు ఇవ్వం.. మీరే బరిలో నిలవాలి’’ ఇవీ ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఈ క్రమంలో అందరికంటే ముందే కేసీఆర్ టికెట్లు ప్రకటించారు. కానీ, పది మంది సిట్టింగులను మార్చారు. ఈ పది మందిలో రెండు సిట్టింగ్ స్థానాల్లో కేటీఆర్ తన క్లాస్‌మేట్లకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ విసయం చాలా మందికి తెలియదు. మరి టిక్కెట్లు దక్కించుకున్న ఆ ఇద్దరు దోస్తులు ఎవరు.. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలేవో తెలుసుకుందాం.
More
From Telangana politics
జాన్సన్ నాయక్.. ఖానాపూర్..
కేటీఆర్.. డిగ్రీ క్లాస్‌మేట్ జాన్సన్ నాయక్. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో జాన్సన్ నాయక్ అమెరికాలో స్థిరపడాడ్డరు. అక్కడ ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తునానరు. ఐదేళ్ల క్రితం ఇద్దరూ అమెరికాలు కలిశారు. తర్వాత తెలంగాణకు జాన్సన్ నాయక్ తరచూ వచ్చిపోయేవారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్న ఆకాంక్ష కలుగడంతో తన స్నేహితుడు కేటీఆర్ వద్ద ప్రస్తావించారని సమాచారం. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై స్థానికంగా వ్యతిరేకత ఉండడంతో ఆమెకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం కావడంతో వెంటనే తన స్నేహితుడు జాన్సన్‌నాయక్‌ను రంగంలోకి దించారు.
సంజయ్‌కుమార్.. కోరుట్ల..
ఇక సిట్టింగులకు తప్ప ఎవరికీ టికెట్ ఇవ్వనన్న కేసీఆర్ కొంతమంది సిట్టింగులను మార్చారు. ఇక వారసులకు టికెట్లు ఇవ్వనని ఖరాకండిగా చెప్పిన గులాబీ బాస్ కోరుట్ల నియోజకవర్గంలో ఈ నిబంధన ఉల్లంఘించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్థానంలో ఆయన కొడుకు, కేటీఆర్ ఇంటర్ క్లాస్‌మేట్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌కు టికెట్ ఇచ్చారు. కేటీఆర్, సంజయ్‌కుమార్ కలిసి ఇంటర్ గుంటూరులోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. తర్వాత ఉన్నత చదువుల కోసం విడిపోయారు. సంజయ్ వైద్య వృత్తివైపు వెళ్లగా, కేటీఆర్ సాఫ్ట్‌వేర్ రంగంవైపు వెళ్లారు. ఇద్దరి సామాజికవర్గం ఒక్కటే కావడం కూడా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్‌కు టికెట్ ఇవ్వడానికి ఒక కారణం కాగా, కేటీఆర్ క్లాస్‌మేట్ కావడం మరోకారణం.
ఇద్దరు స్నేహితులదీ కోరుట్లనే..
ఇక ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన కేటీఆర్ ఇద్దరు స్నేహితుల జాన్సన్ నాయక్, డాక్టర్ సంజయ్‌కుమార్ ఇద్దరూ కోరుట్ల నియోజకవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే ఇద్దరూ వేర్వేలు దశల్లో కేటీఆర్‌కు క్లాస్‌మేట్స్. పొలిటికల్ ఎంట్రీ మరి ఆ ఇద్దరు మిత్రులకు కలిసి వస్తుందో లేదో చూడాలి.