తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్పీకర్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రొ టెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతో బిజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంఐఎంతో రాజకీయ లబ్ధ కోసమే అక్బరుద్దీన్‌ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించారని ఆరోపణలు చేశారు.
మరోవైపు స్పీకర్ ఎన్నిక కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి నామినేషన్లకు రెండు రోజుల గడువు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్‌ను ఇప్పటికే ఎంపిక చేసింది. నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయన నామినేషన్ వేయనున్నారు.
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సమావేశాన్ని డిసెంబర్ 14కు వాయిదా వేశారు. ఆ రోజున సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ను ఎన్నిక లాంఛనంగా కానుంది. ఆ తరువాత డిసెంబర్ 15న శాసనసభ, మండలి ఉభయ సభల్లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై డిసెంబర్ 16న ధన్యవాద తీర్మాణం ప్రవేశపెట్టనున్నారు.