TELANGANA

బీఆర్ఎస్ మాజీలకు షాక్‍ల మీద షాక్‍లు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అధికారులు షాకిచ్చారు.

 

ర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి భార్య కూడా ఇలానే లోన్ తీసుకుని కట్టలేదు. దీంతో రుణం చెల్లించాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.20 కోట్లు మొత్తం కలిపి రూ. 40 కోట్లు చెల్లించాలంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. జీవన్ రెడ్డి తన భార్య పేరు మీద 2017లో స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. ఈలోన్ కు సంబంధించి ఇప్పటి వరకు వడ్డీ కాని, అస్సలు కాని చెల్లించలేదు.

 

అంతకు ముందు ట్రాన్స్ కో, ఆర్టీసీ కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్మూర్ లోని ఆర్టీసీ స్థలాన్ని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట లీజ్ కు తీసుకున్నారు. ఈ సంస్థకు జీవన్ రెడ్డి భార్య రజిత రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ స్థలంలో భారీ భవనం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో మాల్ తో పాటు మల్టీ ప్లెక్స్ కూడా నిర్మించారు. ఈ మాల్ ను గత సంవత్సరం దసరాకు ప్రారంభించారు. మాల్ బహులజాతి కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. కానీ ఆర్టీసీ చెల్లించాల్సిన అద్దె.. ట్రాన్స్ కో చెల్లించాల్సి కరెంట్ బిల్లు చెల్లించలేదు. దీంతో వారు నోటీసులు ఇచ్చారు.

ఇక మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు అయింది. శామీర్ పేట ఎమ్మార్వోతోపాటు, మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో మల్లారెడ్డి ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.