తెలంగాణకు కాళేశ్వరం గుదిబండలా మారింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వందల కోట్లు ఖర్చవుతున్నాయి. కాళేశ్వరంలోని అన్ని పంపులు నడిపితే ఏటా రూ.936.97 కోట్ల కరెంట్బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో ఒక్క మోటారు నడిచినా, నడువకున్నా ఏటా ఫిక్స్ డ్ ఛాచార్జీల రూపేణ రూ.1,337.59 కోట్లు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన లోన్ల రీపేమెంట్, కరెంట్బిల్లులు, ప్రాజెక్టు ఆపరేషన్అండ్మెయింటనెన్స్కు వెచ్చించే మొత్తాన్ని కలుపుకుంటే ఏటా బడ్జెట్లో రూ.25 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
2031-32 ఆర్థిక సంవత్సరం వరకు కాళేశ్వరంపై ఏటా రూ.24 వేల కోట్ల నుంచి రూ.21 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, తెలంగాణకు ఈ ప్రాజెక్టు వల్ల నష్టమే ఎక్కువని వాదనాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతి రెండేళ్లు రూ.19 వేల కోట్లకు పైగా, 2034 -35లో రూ.15 వేల కోట్లు, 2035 -36 ఆర్థిక సంవత్సరంలో రూ.11,359 కోట్లు ఖజానా నుంచే తిరిగి చెల్లించాల్సి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా 195 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ప్రతి సంవత్సరం కరెంట్బిల్లుల కోసమే రూ.9,400 కోట్లు కేటాయించాలి.
కాలేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం కంటే ఖర్చే ఎక్కువ ఉంది. ఈ ప్రాజెక్ట్ కు సీడబ్ల్యూసీ రూ.81,911.01 కోట్లతో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం రూపాయి ఖర్చు చేస్తే 1.52 రూపాయల ఆదాయం సమకూరుతుందని డీపీఆర్లో వివరించారు. ఆ తర్వాతా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1,49,317.22 కోట్లకు పెంచారు. రిజర్వాయర్లలో చేపల పెంపకం ద్వారా రూ.1,750 కోట్ల ఆదాయం సమకూరుతుందని, 20 రిజర్వాయర్ల పరిధిలోని 3.5 లక్షల హెక్టార్ల పరిధిలో చేపల పెంపకం ఉంటుందని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఏం చేసిన రూపాయి ఖర్చు పై 52 పైసలే ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున లోన్లు తీసుకొచ్చారు. దీని కోసం డీపీఆర్ లో వ్యవసాయ ఉత్పత్తులను భారీగా పెంచి చూపిందని కాగ్ వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికైనా తెలంగాణ గుదిబండలాగానే ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు