TELANGANA

తెలంగాణలో అదానీ భారీ పెట్టుబడులు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా ఆయన బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుపర్యటనలో బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. దిగ్గజ గ్రూప్ అదానీ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.దావోస్పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)తో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ సంస్థ రాష్ట్రంలో రూ.12,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.

 

అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీలతో 4 అవగాహన ఒప్పందాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.5000 కోట్లు, డేటా సెంటర్విభాగంలో రూ.5000 కోట్లు, ఏరోస్పేస్అండ్రక్షణ విభాగంలో రూ.1000 కోట్లు, అంబుజా సిమెంట్గ్రిడ్డింగ్యూనిట్లో రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎమ్ఓయూలు కుదిరాయి.

 

అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో రూ.5000 కోట్లతో 100 మెగా వాట్ల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో రూ.5 వేల కోట్ల 1350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీ గూడంలో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ రూ.1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంటు పరిశ్రమను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐదారేళ్లలో ప్లాంటు పూర్తయ్యాక సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ వెల్లడించింది.

 

అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగున్నాయన్నారు గౌతమ్ అదానీ.

 

ఇది ఇలావుండగా, ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజెన్ రూ.2000 కోట్లతో మల్లాపూర్‌లోని పరిశ్రమ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డితో ఆరాజెన్ కంపెనీ సీఈవో మణి కంటిపూడి సమావేశమయ్యారు. ఐదేళ్లలో రూ.2,000 కోట్లతో మల్లాపూర్లో ఔషధ పరిశ్రమ విస్తరిస్తామని దీంతో సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజెన్ సీఈవో వెల్లడించారు. మరోవైపు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్ డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ఎల్డిసీ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమైంది.