ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున ఉదయం 10:30 కు తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.
కవిత అభ్యర్ధన మానవతా కోణంలోకి రాదు తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా ఏప్రిల్ 16వరకు బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టులో వాదనలు జరిగాయి. కుమారుడి పరీక్షలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ తమ వాదన వినిపించింది. కవిత కుమారుడిని చూసుకునేందుకు కుటుంబంలో చాలామంది ఉన్నారని ఈడీ పేర్కొంది.
మాస్టర్ మైండ్ ఆమెనే .. ఆధారాలున్నాయి కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడి వాదించింది. కవిత బెయిల్ పై బయటకు వస్తే దర్యాప్తు పైన ప్రభావం పడుతుందని ఈడి అధికారులు చెబుతున్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మొత్తం ప్లాన్ చేసింది కవితే నని, కవిత దే మాస్టర్ మైండ్ అని ఈడి కోర్టులో పేర్కొంది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది.
కవిత ఫోన్ల డేటా అంతా ఫార్మాట్ చేశారు కవిత తన ఫోన్ డేటా మొత్తం డిలీట్ చేశారని ఈడీ పేర్కొంది. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, కవిత విచారణ సమయంలో తమకు 10 మొబైల్ ఫోన్లను ఇచ్చారని, అయితే అవన్నీ ఫార్మాట్ మొబైల్ చేసిన మొబైల్ ఫోన్లని ఈడి కోర్టుకు వివరించింది. ఈ కేసులో కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగు మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేశారని ఈడీ పేర్కొంది.
కవిత అప్రూవర్ గా మారిన వారిని బెదిరించారు.. ఈడీ వాదన వందల సంఖ్యలో ఈ కేసులో డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని వెల్లడించింది. కవిత తనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఈడీకి చెప్పొద్దని కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారని, ఇలాంటి సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ అభిప్రాయపడింది. దీంతో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.