TELANGANA

స్థానిక ఎన్నికల షెడ్యూల్ మూహుర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

తెలంగాణ(Telangana)లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల(Local Body) ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. గ్రామ పంచాయితీల(Gramapanchayati)కు కాల పరిమితి ఎప్పుడో ముగియగా, వివిధ కార్పోరేషన్లకు ఇటీవలే ప్రత్యేక అధికారుల్ని నియమించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే.. అనేక విషయాలపై అంతర్గతంగా అనేక చర్చలు, సమావేశాలు నిర్వహించిన అధికారులు.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల(reservations) ఖరారుకు సిద్ధమయ్యారు.

 

ఇప్పటికే.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Sithakka)తో సమావేశమైన అధికారులు.. రిజర్వేషన్లు సహా ఇతర అంశాలపై మంత్రికి తెలియజేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. వెనువెంటనే షెడ్యూల్ (shedueled) ప్రకటించేలా ఉండాలని మంత్రులు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. దాంతో.. దాదాపు అన్నీ అంతర్గాత వ్యవహారాల్ని ఓ కొలిక్కి తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న పంచాయితీ(Panchayati), ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సహా.. కార్పోరేషన్ల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 16 లేదా 17 తేదీల్లో పంచాయితీ రిజర్వేషన్లను విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

వివిధ అభివృద్ధి పనులు, ఇతర రాష్ట్రల్లో సదస్సులు, ఎన్నికల హడావిడిలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) .. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసే బాధ్యతను మంత్రి సీతక్కకు అప్పగించారు. పైగా.. పంచాయితీ రాజ్ శాఖ కూడా సీతక్క దగ్గరే ఉండడంతో.. అధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్న మంత్రి సీతక్క.. ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యనిర్వహక శాఖ పని పూర్తయిందని.. వాటిని సీఎం, ఇతర మంత్రి వర్గం నుంచి అనుమతి రావడమే తరువాయి అని అధికారులు తెలుపుతున్నారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలకమైన రిజర్వేషన్ల అంశం తుది దశకు వచ్చినట్లు సీతక్క నిర్వహించిన సమావేశంలో తెలిపిన అధికారులు.. ప్రభుత్వ సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందించేందుకు మరో నాలుగు రోజుల సమయం కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. బుధవారం, ఫిబ్రవరి 12న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు.. ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పంచాయితీ ఎన్నికలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

 

అధికారులు తయారు చేసిన నివేదికపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తే.. ఈనెల 16 లేదా 17 న షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కారణంగానే.. బుధవారం నాడు ఉన్నతాధికారులతో సమావేశం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్ల (District Collectors) తో పంచాయితీ రాజ్ శాఖ అధికారులు వీడియో కన్పరెన్స్ (Video Confirence) సమావేశం నిర్వహించనున్నారు. అందులో.. అనుసరించనున్న విధానాలు, ఎన్నికల ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు