TELANGANA

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. కానీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్లు ప్రకటించారు.

 

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో మరోసారి కులగణన చేపట్టి, రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.