- ఉద్యోగాలు ఇప్పిస్థానని అమయాక యువత నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ DSP.
- అరెస్ట్ చేసి 18 లక్షల నగదు, ఒక కారు, పోలీస్ యూనిఫాం, 2 డమ్మీ మ్యాన్ ప్యాక్ లు స్వాధీనం.
జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపీఎస్ గారు.
ఈ రోజు అనగా 10/3/2025 రోజున ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ నందు ఒక వ్యక్తి అనుమానాస్పదం గా ఉన్నాడు అనే హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారం పై వెంటనే శ్రీ గ్రాండ్ హోటల్ కి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని అదుపు లోకి తీసుకొని బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతనిని విచారించగా అతని పేరు బతుల శ్రీనివాస్ రావు 35 సం,,లు, నివాసం: మట్టపల్లి గ్రామం, మటంపల్లి మండలం అని తెలుపుతూ తనను తాను DSP గా పరిచయం చేసుకొని అమాయకమైన నిరుద్యోగులకు పోలీస్ డిపార్ట్మెంట్ లో, సివిల్ సప్లయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద డబ్బులు తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టుకుంటాడు , గతంలో ఇతని పై మటంపల్లి, రాజముండ్రి 2 టౌన్, నర్సరావపేట రూరల్, త్రిపురాంతకం, మెడికొండూర్ మరియు మార్కాపురం లలో 2022 ఇదే విధంగా మోసం చేయడం తో కేసులు అయినవి జైల్ కి వెళ్ళి బెయిలు పై వచ్చి సెప్టెంబర్ -2024 నుండి మరలా కొంత మందిని ఆటో డ్రైవరు ల ద్వారా, మంగలి షాపుల ద్వారా కొంత మంది DSP గా పరిచయం చేసుకుంటాడు. అదే విధంగా కోదాడ లో ఒక అమ్మాయికి SI ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ. 36,00,000/- (ముప్పై ఆరు లక్షలు), AP లోని మార్టూరు కి చెందిన వ్యక్తి వద్ద కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని వద్ద కొంత మరియు గురజాల కి చెందిన వ్యక్తి వద్ద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లు తీసుకొని తన జల్సాలకు ఖర్చు చేసుకోగా కోదాడ కి చెందిన అమ్మాయి SI ఉద్యోగం కోసం ఇచ్చిన డబ్బులలో మిగిలిన డబ్బులు రూ. 18,00,000/- ( పద్దెనిమిది లక్షలు )అతని వద్ద నుండి రికవరీ చేసి అతనిని రిమాండ్ కి పంపబడును.
ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ కనబరిచిన P.V.Raghavulu, Inspector of Police, Suryapet town along with E.Saidulu, SIP, crime team Vidya Sagar, Krishna, Karunakar, Saidulu and Madhu లను సూర్యాపేట జిల్లా SP గారు అభినందిచ్చినారు.