APNationalTELANGANA

ముగిసిన బడ్జెట్ సమావేశాలు; నిరాశాజనకంగా సభాకార్యక్రమాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ( Budget) ను ప్రవేశపెట్టారు.

ఆ తరువాత ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 వరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ ను అధ్యయనం చేయడం కోసం బడ్జెట్ సమావేశాలకు (Budget Session) విరామం ప్రకటించారు.

 

ఈ బడ్జెట్ సమావేశాల (Budget Session) ఉత్పాదకత (productivity) చాలా తక్కువగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వ్యాఖ్యానించారు. మొత్తం బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ (Lok sabha) ఉత్పాదకత (productivity) 34% కాగా, రాజ్యసభ (Rajya sabha) ఉత్పాదకత 24.4% అని తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 6 బిల్లులు ఉభయ సభల ఆమోదం పొందాయని, మొత్తం 8 బిల్లులను లోక్ సభ (Lok sabha) లో ప్రవేశపెట్టామని వెల్లడించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన తొలి దశ బడ్జెట్ సమావేశాల్లో (Budget Session) లోక్ సభ (Lok sabha), రాజ్యసభ (Rajya sabha) లు 10 మార్లు మాత్రమే సమావేశమయ్యాయి. మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగిన రెండో దశ సమావేశాల్లో (Budget Session) ఉభయ సభలు 15 మార్లు సమావేశమయ్యాయి. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలు 25 సార్లు మాత్రమే సమావేశమయ్యాయి.

 

తొలి దశలో ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget) పైననే చర్చ జరిగింది. లోక్ సభ (Lok sabha) లో బడ్జెట్ పై 14 గంటల 45 నిమిషాల పాటు చర్చ జరగగా, రాజ్యసభ (Rajya sabha) లో 2 గంటల 21 నిమిషాల పాటు మాత్రమే బడ్జెట్ (Budget) పై చర్చ జరిగింది. లోక్ సభ (Lok sabha) లో 145 మంది సభ్యులు, రాజ్యసభ (Rajya sabha) లో 12 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చ సందర్భంగా కూడా ఉభయ సభల్లో పలుమార్లు గందరగోళం చోటుచేసుకుని తరచూ వాయిదాలకు కారణమయ్యాయి.