TELANGANA

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! ఇకపై వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు..

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

 

2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్లు ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నెంబర్ ప్లేట్ల కోసం www.siam.in వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకోవాలని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీవరకు గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవాణాశాఖ క్లారిటీ ఇచ్చింది.. ఇన్యూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు జాగ్రత్తగా గడువు తేదీ లోపే నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.