TELANGANA

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం..! ఎందుకంటే..?

గణపతి హోమం బీఆర్ఎస్ పార్టీకి సానుకూల ఫలితాలు ఇస్తున్నా యా? ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందా? ఎన్డీయే-ఇండియా కూటములు తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్‌ఎస్ నమ్ముతోందా? తెలంగాణ వ్యక్తి ఆ పదవి నిలబడినా, రాజకీయ కారణాలతో దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందా? మధ్యాహ్నం ఆ పార్టీ నుంచి ప్రకటన రానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

బీఆర్ఎస్‌కు మంచి ఛాన్స్ మిస్సయినట్టు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నాయి. ఆయనకు మద్దతు ఇవ్వడం ఖాయమని చాలా పార్టీలు భావించాయి. జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి నిలబడడంతో ఆయనకు మద్దతు ఇస్తే, ఫ్యూచర్ ఇబ్బందులు తప్పవని భావించారట ఆ పార్టీ అధినేత కేసీఆర్.

 

ఈ విషయమై గడిచిన నాలుగైదు రోజులుగా పార్టీ కీలక నేతలతో పలుమార్లు మంతనాలు చేశారు. ఓటు వేసి ఇబ్బందుల్లో పడడం కంటే దూరంగా ఉండడమే బెటరని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా తెలంగాణలో తమ పార్టీ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని భావించారట.

 

అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. లోక్‌సభలో సభ్యులు ఎవరూ లేరు. నోటా లేని కారణంగా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని భావించారు. దీనిపై సోమవారం సాయంత్రంలో ఆ పార్టీ ఓ ప్రకటన చేయనుంది.

 

బీఆర్ఎస్ తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ క్రమంలో బీఆర్ఎస్-బీజేపీ అంతర్గత ఒప్పందం బయటపడిందని విమర్శిస్తోంది. ఈ ఎన్నికకు దూరం ఉండడం పరోక్షంగా బీజేపీకి మేలు చేయడమేనని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు.

 

బీఆర్ఎస్-బీజేపీ అసలు స్వరూపమని బయటపడిందన్నారు. కాంగ్రెస్ వాదనపై బీఆర్ఎస్ నేతలు ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్నారు. ఎవరి రాజకీయాలు వారివని, స్థానిక వ్యక్తిని నిలబెట్టి ఓటు వేయమంటే ఎలాని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆ పార్టీ ఎవరికీ ఓటు వేయకుండా దూరంగా ఉండాలని భావిస్తోందని అంటున్నారు.