TELANGANA

మాగంటి సునీతకు బీ ఫామ్, రూ.40 లక్షల చెక్కును అందజేసిన కేసీఆర్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఎన్నికల వ్యయం కోసం పార్టీ తరపున రూ. 40 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాగంటి సునీతతో పాటు ఆమె కుమార్తె, కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తమ పార్టీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. జూబ్లీహిల్స్‌లో నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.