రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 500 రోజులు పూర్తయింది. అయినా కూడా ఈ యుద్ధం ఆగడం లేదు. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలను అస్థవ్యస్థం చేస్తోంది. చాలా మంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లారు.
అక్కడున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 60 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు శరణార్ధులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 9 వేలకు పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ సుధీర్ఘ యుద్ధం గెలుపు ఎవరిదో స్ఫష్టత రావడం లేదు.
ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షాలు విధించినా.. ఆ దేశం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులే కాదు.. రష్యా సైనికులు కూడా భారీ సంఖ్య ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెనియన్ దళాలు తగినంత ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేకుండా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచ ఆ దేశానికి ఆయుధాలు వస్తున్నాయి. జూన్ నుంచి ఉక్రెయిన్ సైన్యం తూర్పు.. దక్షిణాన రష్యన్ దళాలచే స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడి చేస్తోంది.
యుద్ధంలో మొదట పై చేయి సాధించిన రష్యా క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలో రష్యా చెందిన వేల సైనికులు మృత్యువాతపడ్డారు. దీంతో రష్యా ప్రత్యేక సైనిక నియమాకాలు చెపట్టాల్సి వచ్చింది. నష్టాలను చవిచూస్తున్న సమయంలో, రష్యా దళాలు తీవ్ర ప్రతిఘటనను ప్రదర్శిస్తున్నాయి. రష్యా దళాలు “పటిష్టమైన కోటలను నిర్మించాయి, వారికి చాలా పరికరాలు ఉన్నాయి” అని దక్షిణ ఉక్రెయిన్‌లోని నికోపోల్ నగరంలో 73 ఏళ్ల రిటైర్డ్ టీచర్ ఆంటోనినా మొరఖోవ్స్కా అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఖార్కివ్ ప్రాంతంలో 9,000 చదరపు కిలోమీటర్లు, నవంబర్‌లో ఖేర్సన్ ప్రాంతంలో 5,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. వచ్చే వారం NATO శిఖరాగ్ర సమావేశానికి ముందు, ఉక్రెనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సుదూర ఆయుధాలు, F-16 ఫైటర్ జెట్‌ల కోసం పాశ్చాత్య దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఉక్రెయిన్ సైనిక కమాండర్-ఇన్-చీఫ్ వాలెరీ జలుజ్నీ కూడా పశ్చిమ దేశాల నుండి వాగ్దానం చేసిన ఆయుధాలను నెమ్మదిగా పంపిణీ చేయడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు.