స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో రకంగా జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక చరిత్ర. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ప్రకటించామని, సెప్టెంబర్ 2వ తేదీన పోలవరం లెఫ్ట్ కెనాల్‌కి జలహారతి ఇస్తాంమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రకాశం, రాయలసీమ జిల్లాల దశాబ్దాల కల అయినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ప్రకటించామని సీఏం చంద్రబాబు తెలిపారు. వలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తూ మౌలిక వసతులపై అవగాహన కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

